లాక్‌ డౌన్‌తో వైరస్‌కు లాక్‌ డౌన్ చేద్దాం: తమిళి సై

319
tamili sai
- Advertisement -

లాక్ డౌన్ తో వైరస్ కు లాక్ డౌన్ చేద్దాం అని తెలిపారు గవర్నర్ తమిళి సై. రాజ్‌ భవన్‌లో దీపాలు వెలిగించిన అనంతరం మాట్లాడిన గవర్నర్ …130 కోట్ల భారతీయులు అంతా ఐక్యం గా ఉన్నామని తెలిపేందుకే ఈ కార్యక్రమం అన్నారు.

దీపాలు వెలిగించడం ద్వారా సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయని…దీపం చీకటి నుంచి వెలుగును ప్రసాదిస్తుందని చెప్పారు. ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని ఈ కార్యక్రమం నింపుతుందని…మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం అన్నారు.

ప్రపంచాన్ని ఈ వైరస్ ఇబ్బంది పెడుతుందని…అందరూ తమ వంతుగా ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు తమ వంతు సహకారం అందించాలన్నారు. మీరు ఎక్కడికి వెళ్లిన మాస్కులు ధరించండి..సబ్బు ,సానిటైజర్స్ తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.

- Advertisement -