కరోనా చీకటిపై దీపాల వెలుగులతో యుద్దం..

114
cp

కరోనాపై పోరులో భాగంగా యావత్ భారతావని దీప సంకల్పాన్ని చేపట్టింది. ప్రజలు స్వచ్ఛందంగా దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి కరోనాపై పోరుకు యావత్ భారతావని ఒక్కటిగా నిలిచిందని చాటిచెప్పారు.

నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద విద్యుత్ వెలుగులను ఆర్పీ,కొవ్వత్తులను వెలిగించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మానవ మనుగడకు ప్రశ్నార్ధకంగా మారిన కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు చేస్తున్న యుద్ధంలో ప్రజలంతా ఏకతాటిపై ఉంటాము అన్న సంకల్పాన్ని చాటేలా ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు క్రోవొత్తులను వెలిగించినట్లు గుత్తా తెలిపారు.

తెలంగాణ సమాజం ఉద్యమ స్పూర్తిని చాటుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారని గుత్తా అన్నారు.. తెలంగాణ లో పేదలు, వలస కార్మికులు ఆకలి తో ఇబ్బందులు పడకుండా బియ్యం, నిత్యావసర వస్తువులు, ఆర్ధిక సాయం చేయడం అభినందనీయమని అన్నారు…..

ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో దేశ ప్రధాని మోడీ ఆదేశాలతో కుటుంబ సమేతంగా దీపాన్ని వెలిగించి కరోనా పై యుద్ధభేరి లో తన సంకల్పాన్ని చాటారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

ప్ర‌ధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ఇచ్చిన పిలుపు మేర‌కు హైదరాబాద్ కళ్యాణపురి లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మహమ్మారి క‌రోనా వైర‌స్ పోరుకు సంఘీభావ సంకేతంగా సంకల్ప జ్యోతి వెలిగించారు తుంగతుర్తి శాసనసభ్యులు
డా.గాదరి కిశోర్ కుమార్.

దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు తెలంగాణ చౌక్ (ఇందిరా చౌక్ ) వద్ద జరిగిన దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి లు ఎస్ శ్రీనివాస్ (ఎల్ అండ్ ఓ) జి చంద్రమోహన్ (పరిపాలన) ఏసిపి డాక్టర్ పి అశోక్, ఇన్స్పెక్టర్లు దేవారెడ్డి, దామోదర్ రెడ్డి, నటేష్ ఆర్ఐ లు మల్లేశం, జానిమియా లతో పాటుగా కర్ఫ్యూ విధుల్లో ఉన్న వివిధ విభాగాలకు చెందిన పోలీసులు పాల్గొన్నారు.