ఎవరైనా కష్ట కాలంలో ఉన్న కుటుంబాన్ని పెద్ద మొత్తంలో నగదును ఇచ్చి ఆదుకొవడం కష్టం కానీ మొయ్ విరుందు అనే పద్దతి ద్వారా మాత్రమే అది సాద్యమవుతుంది. సాయం కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా కష్టంలో ఉండే బంధువులకు చేయూతనిచ్చేందుకు ఈ ఆచారాన్ని ప్రారంభించారు. ఒకసారి చదివింపుల విందు నిర్వహిస్తే మళ్లీ ఐదేళ్ల తర్వాతనే ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. తమ ఆర్థిక స్థోమతను బట్టి ఈ విందు ఏర్పాటు చేస్తారు.
మొయ్ విరందు అంటే ఏమిటి.. చదివింపుల విందు…అనగా ఎవరైనా ఆర్ధికంగా కష్టాల్లో ఉంటే వారు శక్తి మేర బంధువులు, స్నేహితులను పిలిచి వారికి విందు ఇస్తారు. విందు తీసుకున్న వారు ఇచ్చిన వారికి ఎంతో కొంత చదివింపులు చేస్తారు. అలా చదివింపులు చేసిన మొత్తంతో తమ జీవితాలను సమూలంగా మార్చుకోని కొత్త జీవితాలను ప్రారంభిస్తారు. కుటుంబ ఖర్చు, పిల్లలు ఆరోగ్యం, విద్యా, వ్యవసాయవసరాల నిమిత్తం ఖర్చు చేసుకుంటారు. మళ్లీ ఏడాది తిరిగి అవతలి వాళ్లు కూడా చదివింపుల విందుకు తిరిగి చెల్లిస్తారు. ఈ ఆచారం కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉంది. తంజావుర్, పుదుకొట్టై తదితర జిల్లాలో చదివింపుల విందు వేడుక వందేళ్లుగా నిర్వహిస్తున్నారు.
డీఎంకే ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన వేడుకల్లో రూ.12కోట్ల చదివింపులు వచ్చాయి. పేరాపూరణి నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ కుమార్ మనవడి చెవులు కుట్టే వేడుక, చదివింపుల విందు ఒకేసారి నిర్వహించారు. వేడుకలో శాకాహారులకు, మంసాహారులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. చదివింపుల సమర్పించే వారి కోసం 40కౌంటర్లు ఏర్పాటు చేసి వసూలు చేశారు. రూ12కోట్ల వసూలు కావడం గమనార్హం.
తెలంగాణలో కూడా చదివింపుల విందు లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో పండుగలు, పబ్బాలు, పేళ్లిళ్లు జరిగేటప్పుడు కట్నాలు కానుకలు పేరిట చెల్లిస్తారు. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో చినరాయుడు అనే సినిమాలో చదివింపుల విందు అనే కార్యక్రమంను సినిమాను చూపించారు. వెంకటేష్, విజయశాంతి నటించిన ఈ సినిమాలో చదివింపుల విందు అనే కార్యక్రమం ద్వారా విజయశాంతి కుటుంబాన్ని ఆదుకుంటారు.