తమిళనాడు సినీ పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అధికారికంగా అనుమతులు మంజూరు చేశారు. ఈ కొత్త నిబంధన జూన్ ఒకటో తేదీ నుంచే అమలులోకి రానుండటంతో కోలీవుడ్ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటివరకు ఉన్న పరిమితుల వల్ల చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులకు ఈ నిర్ణయంతో శాశ్వత పరిష్కారం లభించనుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళ చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది.
థియేటర్ల యజమానులు నిర్మాతలు పంపిణీదారులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్‌ను సీఎం విజయ్ సానుకూలంగా పరిశీలించి ఆమోదముద్ర వేశారు. జూన్ ఫస్ట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్స్‌లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఐదో షో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా రంగంపై ఉన్న వ్యక్తిగత అవగాహనతో పరిశ్రమ మనుగడకు ఈ అదనపు షో ఎంత అవసరమో గుర్తించిన ముఖ్యమంత్రి ఫైల్‌పై సంతకం చేశారు. దీనివల్ల చిత్ర పరిశ్రమ ఆర్థికంగా మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read;మళ్లీ పెరిగిన CNG ధరలు!
ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన సానుకూల అంశం ప్రేక్షకులకు ఎలాంటి అదనపు భారం పడకపోవడమే. సాధారణంగా సినిమా వసూళ్లు పెరగాలంటే టికెట్ రేట్లు పెంచడం చేస్తుంటారు. దీనివల్ల సామాన్య ప్రేక్షకులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. అయితే ప్రస్తుత నిర్ణయం వల్ల టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేకుండానే థియేటర్ల కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

