ఐపీఎల్ 2026 సీజన్ గ్రూప్ స్టేజ్ ముగియగా గ్రూప్ స్టేజ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల వివరాలను చూస్తే..
()గుజరాత్ టైటాన్స్ (GT) ఓపెనర్ సాయి సుదర్శన్ 14 మ్యాచ్‌ల్లో 49.08 అద్భుతమైన సగటుతో 638 పరుగులు చేశాడు. కన్‌సిస్టెంట్‌గా ఆడిన సాయిసుదర్శన్ 157.92తో ఉన్నాడు.
()గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ , ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ సీజన్‌లో అదరగొట్టాడు. 47.38 సగటుతో 161.68 స్ట్రైక్ రేట్‌తో 616 పరుగులు సాధించాడు.
()సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మిడిల్ లో ఆ జట్టుకు వెన్నెముకగా ఉన్నాడు. స్టార్ ఫినిషర్‌గా రాణిస్తూ 50.50 సగటుతో 159.47 స్ట్రైక్ రేట్‌తో 606 పరుగులు చేశాడు.
Also Read:కార్తి బర్త్ డే..కొత్త సినిమా ప్రకటన
()ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతను 174.41 మెరుపు స్ట్రైక్ రేట్‌తో 593 పరుగులు చేశాడు.
()రాజస్థాన్ రాయల్స్ (RR) యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో దుమ్మురేపాడు. అతను 41.64 సగటుతో కళ్ళు చెదిరేలా 232.27 భారీ స్ట్రైక్ రేట్‌తో 583 పరుగులు బాదాడు.

