మళ్లీ పెరిగిన CNG ధరలు!

7
- Advertisement -

వరుసగా చమురు ధరలతో పాటు గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై తీవ్ర భారం పడుతోంది. తాజాగా ఇంధన ధరల భారాన్ని మరింత పెంచుతూ మంగళవారం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను కిలోకు రూ. 2 పెంచారు. ఈ తాజా పెంపు తర్వాత ఢిల్లీలో సిఎన్‌జి ధర కిలోకు రూ. 83.09 కి చేరింది.

ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడగా గ్యాస్ పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాలను తట్టుకోవడానికి గత 10 రోజులుగా సిఎన్‌జి ధరలను వరుసగా పెంచుతూ వస్తున్నారు. వారంలోపే ధరలు పెరగడం ఇది రెండోసారి కాగా మే 17న సిఎన్‌జి ధరను కిలోకు రూ. 1 పెంచారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ముడి చమురు మార్కెట్లో అస్థిరత కారణంగా సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగగా గత రెండు వారాల్లో ధరలు పెరగడం ఇది నాలుగోసారి.

Also Read:కార్తి బర్త్ డే..కొత్త సినిమా ప్రకటన

- Advertisement -