Quad:ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఫోకస్

10
- Advertisement -

ఢిల్లీలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షత వహించగా అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి హాజరయ్యారు.

ఈ సమావేశంలో ప్రాంతీయ భద్రతా సవాళ్లను సమీక్షించడంతో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, కనెక్టివిటీ, కీలక సాంకేతికతలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు వ్యూహాత్మక సమన్వయం వంటి కీలక రంగాలలో నాలుగు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై ప్రధానంగా చర్చించారు.

భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన ‘క్వాడ్’ (QUAD) కూటమి…ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించే ఒక ప్రధాన వ్యూహాత్మక కూటమిగా అవతరించింది. గత ఏడాది వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత దాదాపు ఏడాది కాలానికి ఈ చర్చలు జరుగుతున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా క్వాడ్ కూటమి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదురవుతున్న క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి సముద్ర భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ మరియు ప్రాంతీయ స్థితిస్థాపకత వంటి పలు రంగాలలో అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. 2024లో విల్మింగ్టన్‌లో జరిగిన గత క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో, నాలుగు దేశాల అధినేతలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి కీలకమైన చర్యలను ప్రకటించారు.

Also Read:మళ్లీ పెరిగిన CNG ధరలు!

క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ..నేను విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాల్లోనే నా మొదటి సమావేశపు ఎజెండాలో క్వాడ్ అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంది. గత ఏడాది కాలంగా మా ఉమ్మడి లక్ష్యం ఏమిటంటే.. కేవలం ఒక వేదికపై కలిసి సమస్యల గురించి మాట్లాడుకోవడమే కాకుండా, వాటి పరిష్కారానికి ఆచరణలో పనులు చేయడం. మేము పరస్పర సహకార రంగాలలో చాలా చురుగ్గా అద్భుతంగా పనిచేస్తున్నామని మా ప్రజలకు సగర్వంగా చెప్పగలం అని తెలిపారు.

- Advertisement -