తమిళనాడు ప్రజల పూజలు ఫలించాయి. అమ్మ ఆరోగ్యం బాగుపడాలని,,జయలలితను మళ్లీ మునపటిలా చూడాలన్నా కోట్ల మంది తమిళ అభిమానుల ఆశ,, అమ్మకు ఊపిరిపోసింది. వైధ్యుల కఠోర శ్రమ జయలలితను మళ్లీ మామూలుగా చూసేలా చేసింది. గత నెలన్నర రోజులుగా అనారోగ్యం కారణంగా,,అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలితను,,త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) నుంచి గదిలోకి మారుస్తారట. ఈ విషయాన్ని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ చెప్పారు. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడి,,శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన వివరించారు. గత వారం రోజులుగా ఆమెకు ఒక మాదిరి ఘన ఆహార పదార్థాలను ఇస్తున్నారన్నారు. ఇప్పుడు ఆమె అందరితో మాట్లాడుతున్నారని కూడా తెలిపారు.
తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో జయలలితను (68) సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆమెకు కొంత ఇన్ఫెక్షన్ ఉన్నందున ఇప్పటికీ కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని, అందువల్ల మరికొంత కాలం పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. సీఎం జయలలితను ఎప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చెయ్యాలన్నది వైద్యులు నిర్ణయిస్తారని పొన్నియన్ చెప్పారు. ఆమె ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, మిగిలిన సమస్యలను ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స చేయాలా, లేక ఇంట్లో చికిత్స చేయాలా అనే విషయం వైద్యులు నిర్ణయిస్తారని పొన్నియన్ వివరించారు.తమిళనాడు ప్రజల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ఫలించి జయలలిత త్వరగా కోలుకున్నారని పొన్నియన్ వివరించారు. అదే విధంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా జయలలిత చాల రోజుల పాటు జ్వరంతో బాదపడ్డారని ఆయన గుర్తు చేశారు. అయితే అపోలో, ఎయిమ్స్, లండన్, సింగపూర్ వైద్యులు కలిసి వైద్యం చెయ్యడంతో జయలలిత సాధారణ స్థితికి వచ్చారని, వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని పొన్నియన్ చెప్పారు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.