మెగా హీరోకు షాక్….సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరో

366
Vijay sethupathi Panja Vaishav Tej
- Advertisement -

సుప్రీమ్ స్టార్  సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ ప్రారంభమైంది. శరవేగంగా ఈచిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే ఈసినిమాలో కీలక పాత్రలో నటించేందుకు తమిళ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే విజయ్ సేతుపతికి తమిళ్ లో సినిమాలు ఎక్కువ అవడంతో వైష్ణవ్ తేజ్ మూవీని క్యాన్సల్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఆయన స్ధానంలో పవర్ పుల్ యాక్టర్ కోసం వెతుకుతున్నారట చిత్రబృందం. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వైష్ణవ్ సరసన మలయాళ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక విజయ్ సేతుపతి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి మరి.

- Advertisement -