బాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం క్వీన్. కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఈ చిత్రాన్ని సౌత్‌లో నాలుగు భాషలలో రిమేక్ చేస్తున్నారు.
తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ అగర్వాల్, కన్నడలో పారుల్ యాదవ్, మలయాళంలో మంజిమ మోహన్ ప్రధాన పాత్రల్లో ‘క్వీన్’ రీమేక్స్ తెరకెక్కుతున్నాయి. తెలుగులో ‘క్వీన్’గానే తెరకెక్కుతుండగా తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’ , కన్నడలో ‘బటర్ ఫ్లై’ , మలయాళంలో ‘జామ్ జామ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది.
ఒకే లొకేషన్లో షూటింగ్ జరుగుతుండడంతో ఆ భామలు కూడా హ్యపీగా ఫీలవుతున్నారు. అంతేగాదు నాలుగు భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న క్వీన్ సినిమా వివరాలను ఆయా నటీనటులు, టెక్నీషియన్స్ తో ఎప్పటి కప్పుడు పంచుకోవడానికి మూవీ యూనిట్ ఈ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసింది. ఇందులో నలుగురు హీరోయిన్స్ సభ్యులుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో నలుగురు క్వీన్స్ ఇవాళ సోషల్ మీడియా లైవ్ ద్వారా అభిమానుల ముందుకొచ్చారు. తమన్నా, మిగతా ముగ్గురు క్వీన్స్‌తో వున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పారుల్ తప్ప, మిగతా క్వీన్స్ అందరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. తమన్నా, కాజల్ తెలుగులో స్టార్ హీరోయన్స్ కాగా, మంజిమ మాత్రం ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించింది. అదే ‘సాహసం శ్వాసగా సాగిపో‘.
నలుగురు హీరోయిన్స్ ఒకేసారి షూటింగ్ చేయడం చాలా అరుదు. ఇది విని చాలా హ్యపీగా ఫీలయ్యాను. ఇలా అందరికి ఒకే చోట బస ఏర్పాటు చేసినందున మా మధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అని అంటోంది తమన్నా. ఒకే సారి కెరీర్ స్టార్ట్ చేసిన మా అందరి మధ్య చక్కని రిలేషన్ ఉంది. ఇండస్ట్రీలోని నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో తమన్నా ఒకరు. షూటింగ్ కోసం ఇలా అందరం ఒకే చోట ఉండాల్సి రావడం జరుగుతోంది అని కాజల్ పేర్కొంది.