రష్మికాను ఫాలోఅవుతున్న తమన్నా..!

658
tamanna
- Advertisement -

గీతాగోవిందం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ రష్మికా. ఈ సినిమా హిట్‌తో అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ డియర్ కామ్రేడ్‌ మూవీలో క్రికెటర్‌గా అలరించింది. ఈ మూవీలో రష్మికా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ నేపథ్యంలోనే రష్మీకాను ఫాలో అవుతుంది తమన్నా. అయితే రష్మికా మాదిరిగా క్రికెటర్‌గా కాకుండా కబడ్డీ కూత పెట్టనుంది మిల్కీబ్యూటీ. టీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం సంపత్ నందితో చేసే మూవీలో కబడ్డీ కోచ్‌గా కనిపించనుందట తమన్నా.

ఇటీవలె సినిమా షూటింగ్ ప్రారంభం కాగా గోపిచంద్ హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం గోపిచంద్ నటించిన చాణక్య బాక్సాఫీస్ వద్ద బోళ్తా కొట్టడంతో ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు గోపిచంద్. ఈ నేపథ్యంలో తమన్నా గ్లామర్‌ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.

- Advertisement -