అభిమానులు తమ ఫేవరేట్ హీరోయిన్లకు రకరకాల బిరుదులతో పిలుస్తుంటారు. అలాగే, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకు కూడా ఒక టైటిల్ వుంది. అదేమిటంటే.. మిల్కీ బ్యూటీ! అందుకే, తమన్నా గురించి చెప్పేటప్పుడు ముందుగా మిల్కీ బ్యూటీ అనే బిరుదు తగిలించేస్తూ వుంటారు.అయితే, ఆ టైటిల్ అంటే తమన్నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ తాజాగా వెల్లడించింది.
“ఫ్యాన్స్ ప్రేమతోనే అలా పిలుస్తున్నారు. అది నాకు తెలుసు. కానీ, ఆ పేరు నాకు నచ్చదు. మేని ఛాయను బట్టి ఇలా పేర్లు పెట్టడం తప్పనే చెప్పాలి. మన దేశంలో చాలామందిలో ఇలా వైట్ కలర్ స్కిన్ పట్ల అదో రకమైన ఆకర్షణ, వ్యామోహం వున్నాయి. ఇది మంచిది కాదు. అందుకే, మేని ఛాయను బట్టి కాకుండా, మన ప్రతిభను బట్టి టైటిల్స్ ఇస్తే బాగుంటుంది” అని చెప్పింది ఈ మిల్కీ బ్యూటీ.
ప్రస్తుతం తమన్నా ఓ వైపు సినిమాలు మరోవైపు ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.రామ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌ను ముందుగా తమిళంలో ప్రసారం కానుంది. తర్వాత వివిధ భాషల్లో కూడా ప్రసారం చేయనున్నారు.