చిరు జవాబుకు సమంత షాక్‌..!

48
chiru

టాలీవుడ్ బ్యూటీ సమంత ‘ఆహా’ ఓటీటీ ‘సామ్ జామ్’ షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో సక్సెస్ బాటలో కొనసాగుతోంది. మొదటి గెస్ట్‌గా సమంతతో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేయగా.. ఆ తర్వాత రానా, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు ఈ ప్రోగ్రాంకి వచ్చారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చేసింది. క్రిస్మస్ రోజున సమంత- చిరంజీవి సందడి చూడబోతున్నారు.

అయితే ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన చిరు, తన తాజా చిత్రం ‘ఆచార్య’ గురించిన విషయాలను పంచుకుంటూనే నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఆ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో చిరంజీవిని ఆట పట్టించాలని సమంత ప్రయత్నించగా, చిరు సైతం దీటుగానే సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. “మీ ఇంట్లోని ఫ్రిజ్ లో ఎప్పుడైనా ఉండే ఐటమ్ ఏంటి?” అని సమంత ప్రశ్నించగా, “సమంతా… మీరు అనుకునేది మాత్రం కాదు” అంటూ మెగాస్టార్ చురకలేశారు.

Sam Jam Mega Promo Soon | Samantha Akkineni | Megastar Chiranjeevi | An aha Original