మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్లతో ఐటమ్ సాంగ్స్ చేయించడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త భామలతో పోటీ ఎక్కువవడంతో ఐటమ్ సాంగ్స్ చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనకాడటంలేదు. గతంలో ‘అల్లుడు శీను’ .. ‘జాగ్వార్’ వంటి సినిమాల్లో కొత్త కథానాయకుల కాంబినేషన్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసిన తమ్ము స్వింగ్ జర అంటూ జై లవకుశలో కూడా మెరుపులు మెరిపిద్దామనుకుంది.
కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అందుకే ఈ మిల్కీ బ్యూటీ ఈ సారి చేసిన ప్రయత్నం ఫలించలేదు. విడుదలకు ముందుకు చిత్ర యూనిట్ కూడా తమన్నా చేసిన పాట మూవీకే హైలైట్ అవుతుందని ప్రచారం చేసింది. ‘స్వింగ్ జరా’ అంటూ సాగే ఈ హుషారైన పాటను మొత్తం ఆడియోతో కాకుండా సెపరేట్‌గా విడుదలచేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. కానీ సినిమా చూసిన తరవాత ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.
తమన్నా సాంగ్ ఆశించినంతగా అలరించకపోగా, సినిమా నెగిటివ్ ఎలిమెంట్స్‌లో ఒకటిగా నిలిచిందని ప్రేక్షకులు అంటున్నారు. అయితే తారక్ నట విశ్వరూపంతో ‘జై లవ కుశ’ నెగిటివ్స్ అన్నీ మాయమైపోయాట. గతంలో ‘ఆగడు’ సినిమాలో శృతిహాసన్, ‘సరైనోడు’లో అంజలి, ‘నాయక్’లో చార్మి, ‘కొమరంపులి’లో శ్రియ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేశారు. వీళ్ల విషయంలో కూడా అప్పట్లో రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇప్పుడు తమ్ము బేబి కూడా ఆ జాబితాలో చేరిపోయింది.