రామ్ చరణ్‌కు నో చెప్పిన రకుల్‌..!

232
- Advertisement -

బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం త‌న 12వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి, ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. వివేక్‌ ఒబెరాయ్ ఈ సినిమాలో విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని సమాచారం. ఇక ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌ను బాలీవుడ్ భామతో చేయించనున్నారనే టాక్ వచ్చింది.

Rakul Preet

అయితే ఈ ఐటమ్ సాంగ్ కోసం ముందుగా రకుల్‌ను అడిగినట్టుగా సమాచారం. తెలుగులో రకుల్‌కి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఆమె కోలీవుడ్‌పై దృష్టి పెట్టి తమిళ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది. ఈ క్రమంలో చరణ్ – బోయపాటి సినిమా నుంచి ఐటమ్ ఆఫర్ ఆమెకి వెళ్లింది. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నాననీ .. ఐటమ్ సాంగ్ చేయడం కుదరదని రకుల్ స్పష్టం చేసిందట.

- Advertisement -