తమన్నాతో మళ్లీ.. బోర్ బాసూ

19
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఇప్పుడు మరో కీలక పాత్రలో తమన్నా నటించబోతుంది. ఇప్పుడు ఐటెం సాంగ్స్ కి చాలామంది దర్శకనిర్మాతలు తమన్నా వైపే చూస్తున్నారు. గత ఏడాది జైలర్ లో రజనీకాంత్ సరసన ఐటెం స్టెప్స్ వేసిన తమన్నా అంతకు ముందు విజయ్ సినిమాతో పాటు పలు చిత్రాల్లో కూడా ఆడిపాడింది.

ఇక ఈ ఏడాది బాలకృష్ణ – బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా తమన్నా ఓ ఐటమ్ సాంగ్ చేయబోబోతుంది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ మెగాస్టార్ తో మరోసారి ఐటమ్ సాంగ్ లో ఆడబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానితో మెగా అభిమానులు ‘మెగాస్టార్ సారూ మీ పక్కన తమన్నా అంటే బోర్ కొట్టేస్తుందేమో కాస్త ఆలోచించండి.. ఇప్పటికే ఆమె మీతో ఐటమ్ స్టెప్స్ వేసింది. మీ తమ్ముడితోనూ ఆడిపాడింది. అలాగే చరణ్ తో కలిసి రొమాన్స్ చేసింది.

మరోపక్క పలు చిత్రాల్లో కూడా తమన్నా ఐటెం సాంగ్స్ చేస్తుంది. అందుకే ఆమె అంటే బోర్ కొట్టేస్తుంది.. కాబట్టి, మీరు ఓ కొత్త హీరోయిన్ ని తీసుకోండి అంటూ మెగాస్టార్ కి మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాని భారీ స్థాయిలో చేయబోతున్నారు. పైగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి మరోసారి డ్యూయెల్ రోల్‌‌‌‌‌‌‌‌ లో కనిపించనున్నారు. అలాగే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ క్యామిమో రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -