Kishan Reddy:370 సీట్లు గెలుస్తాం

15
- Advertisement -

370 సీట్లు గెలుస్తామనే విశ్వాసం ప్రజలు, కార్యకర్తల మద్దతు చూస్తుంటే తెలుస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి…యాత్రలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను కలిసే కార్యక్రమం చెప్పట్టాం అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు మరో నాలుగు చోట్ల యాత్రలు ప్రారంభం అయ్యాయని..ఎంపి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కి ఏ రకమైన ఎజెండా లేదు అన్నారు.

పోటి చేయాల్సిన అవసరం లేదు.. ఒక్క సీటు గెలవకపోయిన ఏమి జరగదని…BRS పార్టీ అవినీతి, అధికార దుర్వినియోగం, కుటుంబ పెత్తనానికి పరిమితమయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కెసీఆర్ కుటుంబం అన్న ప్రజలకు విపరీతమైన కోపం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో తెలియదని…అధికారంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లో మాత్రమేనన్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో 4, కర్ణాటక లో 20 ఎంపి సీట్లను బీజేపీ గెలవబోతుందని…తెలంగాణలో వాళ్ళు మూడు సీట్లు గెలిచిన ఢిల్లీలో చేసేది ఏమి లేదన్నారు. మోదీ ప్రధాని కావడం ఓవైసీ, కెసీఆర్, రాహుల్ ఎవరు ఎన్ని కుతంత్రాలు, తప్పుడు ప్రచారం చేసిన ఆపలేరన్నారు. ప్రధాని మోదీ 9 ఏళ్లుగా ధర్మంగా, నీతివంతమైన పాలన అందించారన్నారు.

తెలంగాణలో అప్పుడే కాంగ్రెస్ పై వ్యతిరేకత ప్రారంభమైందని…ఆరు గ్యారెంటీలు… ఆరు గారడీలుగా మారిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టడం లేదని…సోనియా కుటుంబం సేవ, సూటుకేసులు ఎలా మొయ్యలి అనే ఆలోచన తప్ప హామీలపై దృష్టి లేదన్నారు. ఇచ్చిన హామీలకు నిధులను ఎలా సమకూర్చుకుంటారు చెప్పడం లేదని…విద్యుత్ కోతలతో కర్ణాటకలో రైతులు రోడ్డున పడ్డారన్నారు. ఒక్క ఆర్టీసి ఉచిత ప్రయాణంతో ప్రజల్లో వెలుగులు రావు, జీవితాలు బాగుపడవని…17 సీట్లు వస్తె ఢిల్లీ నుంచి నిధులు తెస్తామని సీఎం అంటున్నారన్నారు.తెలంగాణలో 17 సీట్లు గెలవడం కోసమే పోటి చేస్తున్నాం…పాలమూరు యూనివర్సిటీకి కేంద్రం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు.

Also Read:స్లిమ్ లుక్ లోకి కీర్తి సురేష్

- Advertisement -