ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పిన తమన్నా

35
- Advertisement -

తమన్నాలో ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి. అధిక రెమ్యునరేషన్ ఇస్తే.. దేనికైనా రెడీ అనేలా ఉంది ఆమె తీరు. దీంతో తమన్నా పై ఆమె ఫ్యాన్స్ కూడా విమర్శలు చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా తనపై వచ్చిన పలు విమర్శలకు సమాధానం చెప్పింది. తమన్నా మాట్లాడుతూ.. ఈ మధ్య నన్ను అందరూ ఎందుకు హద్దులు దాటి అందాలు ఆరబోస్తున్నావ్ అని అడుగుతున్నారు. నన్ను ప్రేమించే నా ఫ్యాన్స్ కోసం నేను ఎలాంటి పాత్రలు అయినా చేస్తాను. పాత్ర పరిధిని బట్టి అందాల ఆరబోత ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ లో నేను రొమాంటిక్ సీన్స్ కూడా చేశాను. ఆ సీన్స్ కోసం మేం ఎంతో కష్ట పడ్డాం.

అసలు ఒక సెట్ లో ముప్పై మంది ముందు బట్టలు విప్పి.. రొమాన్స్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. అయినా నేను చేశాను. నా కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు. ఒకరి కష్టాన్ని చూసి హేళన మాత్రం చెయ్యొద్దు’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా ఇంకా మాట్లాడుతూ.. నాతో నటించే హీరోల వయసుతో నా వయసును పోల్చడం కరెక్టు కాదు.. హీరో, హీరోయిన్‌ మధ్య వయసు భేదాలు ఎందుకు చూస్తున్నారు? సినిమాలో నటించే పాత్రల ఔచిత్యం మాత్రమే చూడాలని తెలిపింది. తనకు 60 ఏళ్ల వయసులోనూ టామ్‌ క్రూజ్‌లా విన్యాసాలు చేయాలని వుందని తమన్నా తెలిపింది.

Also Read:పెళ్లి ప్రచారంపై తరుణ్ క్లారిటీ

పనిలో పనిగా గతంలో తన ప్రేమ గురించి తమన్నా ఓపెన్ అయ్యింది. గతంలో ఓ వ్యక్తితో బ్రేకప్ అవ్వడం వల్ల నేను డిప్రెషన్‌కి గురయ్యాను. దీనికి తోడు థైరాయిడ్ సమస్య ఉండటంతో సడెన్ గా బరువు పెరిగాను. అయితే, ఫైనల్‌గా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత బరువు తగ్గాను. స్లిమ్ అయ్యాను అని తమన్నా చెప్పింది. మొత్తమ్మీద తమన్నా నటుడు విజయ్ కుమార్ తో డీప్ లవ్ లో ఉంది.

Also Read:బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య!

- Advertisement -