నిహారికతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు

48
- Advertisement -

ఇటీవ‌ల భ‌ర్త చైత‌న్య నుంచి విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యిందనే వార్త బాగా వైరల్ అయింది. పైగా వరుడు ఎవరో కాదు.. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్‌లతో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తున్న హీరో తరుణే అని టాక్ నడిచింది. మొత్తానికి నిహారిక కు కాబోయే భర్త తరుణ్ అంటూ పుకార్లు పుట్టించారు. అయితే గ‌తంలో త‌రుణ్ పెళ్లిపై అనేక రూమ‌ర్లు వ‌చ్చాయి. మ‌రి ఇది కూడా రూమారేనా? లేక నిజ‌మా? అని స్వయంగా తరుణ్ నే అడిగితే.. ఆయన ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చారు.

తరుణ్ మాట్లాడుతూ.. . ఈ ప్రచారం నా వరకూ వచ్చింది. అయితే, నిహారికతో నా పెళ్లి అనేది నిజం కాదు. నిహారిక నాకు బాగా తెలుసు. ఆమెతో నాకు మంచి స్నేహం కూడా ఉంది. కానీ మా పెళ్లి అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా చెబుతానని తరుణ్ స్పష్టం చేశారు. అలాగే ఇలాంటి వార్తల పై తరుణ్ సీరియస్ అవుతూ… అసలు ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తనకు తెలియడం లేదని తరుణ్ అసహనం వ్యక్తం చేశాడు.

Also Read:పెళ్లి ప్రచారంపై తరుణ్ క్లారిటీ

అలాగే ఈ వార్త పై నిహారికను కూడా అడగడం జరిగింది. ఆమె కూడా చాలా క్లారిటీగా చెప్పారు. తరుణ్ తో మెగా డాటర్ నిహారిక వివాహం అనే వార్త పూర్తిగా అవాస్తవం అని ఆమె చెప్పారు. నిహారిక ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను సినిమాల పై, వెబ్ సిరీస్ ల పై ఫుల్ ఫోకస్ పెట్టానని.. ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని.. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకున్నా.. అందరికీ చెప్పే చేసుకుంటాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

Also Read:ఈ చిట్కాలతో తెల్లజుట్టుకు చెక్!

- Advertisement -