టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరు మిల్కీబ్యూటీ తమన్నా. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చిన తమన్నా…స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా….ఇండస్ట్రిలో సమస్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలలో హీరోలకి, హీరోయిన్స్ కి, అలాగే మిగిలిన ఆర్టిస్టుల మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారని… ఎవరి రేంజ్ కి తగ్గట్టు వారికి సౌకర్యాలు, మర్యాదలు ఉంటాయని తెలిపింది.
ఇటీవల కొంతమంది హీరోయిన్స్ హీరోలని ఒకలా, మమ్మల్ని ఒకలా చూస్తారు అని…మహిళలకు సినిమా రంగంలో సరైన మర్యాద లేదన్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోలు పాల్గొనకపోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ హీరోయిన్లు పాల్గొనకపోతే వెంటనే వారికి దర్శక, నిర్మాతలతో సమస్యలు, విభేదాలు అంటూ ప్రచారం చేస్తారన్నారు.