టాక్ ఆఫ్ ఇండియా…హిమదాస్‌

426
Himadas
- Advertisement -

ఇప్పుడు ఇండియా మొత్తం ఆమెగురించే మాట్లాడుతోంది. సోషల్ మీడియానే కాదు ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ జరుగుతోంది. అసలు ఎవరి హిమదాస్,ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు.

వయసు 19 ఏళ్లు కానీ భారతదేశ క్రీడా రంగంలో ఎవరికి సాధ్యం కానీ ఫీట్ సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశానికి పసిడి పంట పండించింది. కేవలం 18 రోజుల్లో ఏకంగా 5 స్వర్ణాలు గెలిచి సత్తాచాటి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ 19 ఏళ్ల ఈ అస్సాం రన్నర్‌ దేశానికి స్పూర్తిగా నిలిచింది.

ఒకప్పుడు ఆమె పరుగుకే పనికి రాదన్నారు. అంతా ఎగతాళి చేసిన వారే. కానీ ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్‌ బ్రాండ్ షూ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. అంతేగాదు దేశానికి ఐదు స్వర్ణాలు సాధించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.

చెక్ రిపబ్లిక్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ పోటీల్లో క్లాడో అథ్లెటిక్ మీట్, కుంటో అథ్లెటిక్ మీట్, పోజ్నన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్, టబోర్ అథ్లెటిక్స్ మీట్, నోవె మెట్రో నాడ్ మెటుజి గ్రాండ్ ప్రిక్స్ లో బంగారు పతకం గెల్చుకుంది .

2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల 400 మీటర్ల పరుగులో కొద్ది తేడాలో పతకం గెలిచే ఛాన్స్ మిస్సైంది. ఆ తర్వాత అండర్‌-20 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్ లో సత్తా చాటింది.. 400 మీటర్లలో స్వర్ణం చేజిక్కించుకోవడంతో హిమాదాస్‌ పేరు ఒక్కసారిగా మార్మోగింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికల్లా స్వర్ణాల పాంచ్ పటాకా మోగించింది గోల్డెన్ గర్ల్.

దీంతో ఇప్పుడు ఎవరినోట విన్నా హిమదాస్ పేరే వినపడుతోంది. ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నీవే ఒక స్ఫూర్తి. ది గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా.. సలామ్ అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

- Advertisement -