కీలక పదవిలో ఎమ్మెల్యే రోజా భర్త

254
roja selvamani
- Advertisement -

నగరి ఎమ్మెల్యే , వైసిపి కీలక నేత రోజా భర్త సెల్వమణి తమిళంలో టాప్ దర్శకుడన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళ దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ పోటీల్లో రోజా భర్త సెల్వమణి పోటీ చేసి ఘన విజయం సాధించాడు. తమిళ్ లో ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఇంతవరకు అధ్యక్షుడిగా వున్న విక్రమన్‌ పదవీకాలం ఈ నెలాఖరులతో ముగియనుండడంతో కొత్త కార్యవర్గ సభ్యుల ఎంపికకు సంబంధించి ఎన్నికలు నిర్వహించారు.

ఈ మేరకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు. ఈనెల 9, 10 తేదీల్లో ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి ఆర్‌కే సెల్వమణి, విద్యాసాగర్‌ పోటీచేయగా, ఉపాధ్యక్ష పదవికి కేఎస్‌ రవికుమార్‌, మురుగన్‌, రవిమరియాలు పోటీకి దిగారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలతో ముగిసింది. అనంతరం ఎన్నికల అధికారి సెంథిల్‌నాథన్‌ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరిగింది.

దర్శకుల సంఘంలో మొత్తం 2,700 మంది సభ్యులుండగా 1,508 ఓట్లు పోలయ్యా యి. అందులో ఆర్‌కే సెల్వమణికి 1,386 ఓట్లు రాగా ఆయన పై పోటీచేసిన విద్యాసాగర్‌కు కేవలం 100 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తనను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన సభ్యులకు ఈ సందర్భంగా సెల్వమణి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా దర్శకుడిగా ఎననికైన కే ఎస్‌.రవికుమార్‌ 1,489 ఓట్లు సాధించారు.

- Advertisement -