- Advertisement -
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉదయం బల్కంపేట ఎల్లమ్మకు రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమ్మ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం నిర్వహించారు.
కూన వెంకటేష్ గౌడ్, శివరాంరెడ్డి సహకారంతో రెండున్నర కిలోల బంగారు చీరను అమ్మవారికి సమర్పించామన్నారు మంత్రి తలసాని. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారని.. భవిష్యత్ లో దేశానికి కూడా వారు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు తలసాని.
- Advertisement -