సీఎం కేసీఆర్‌ బర్త్ డే…పవన్ విషెస్

231
- Advertisement -

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన పవన్…. తాను అభిమానించే సమకాలీక రాజకీయవేత్తల్లో కేసీఆర్‌ ఒకరని పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల వారందరినీ అక్కున చేర్చుకోవడం ఆయన పరిపాలనా దక్షతకు ప్రతీకని కొనియాడారు. వేర్వేరు రాజకీయ పంథాలు అనుసరించేవారు కూడా కేసీఆర్‌ను ఇష్టపడడం.. ఆయనలోని రాజకీయ ప్రజ్ఞ, పాటవాలకు నిదర్శనమన్నారు. కేసీఆర్‌ చిరంతనంగా ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఆయనకు ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

https://twitter.com/JanaSenaParty/status/1361904902021079044/photo/1
- Advertisement -