టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డుప్లెసిస్‌..

151
du plesis
- Advertisement -

సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్‌ డుప్లెసిస్‌ టెస్టె క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. రిటైర్మెంట్ ప్ర‌క‌టించడానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు. టెస్టుల నుంచి రిటైరైన త‌ర్వాత తాను టీ20ల‌పై దృష్టి సారించ‌నున్న‌ట్లు చెప్పాడు.2012, న‌వంబ‌ర్‌లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో తొలి టెస్ట్ ఆడిన డుప్లెస్సి.. త‌న చివ‌రి టెస్టును రావ‌ల్పిండిలో పాకిస్థాన్‌పై ఆడాడు. 36 ఏళ్లు డుప్లెస్సి 69 టెస్టుల్లో 4,163 ప‌రుగులు చేశాడు. అందులో 10 సెంచ‌రీలు, 21 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

కెరీర్‌లో బెస్ట్ స్కోరు 199. . సౌతాప్రికా టీమ్‌ను 36 టెస్టుల్లో లీడ్ చేసిన డుప్లెస్సి 18 మ్యాచ్‌ల‌లో గెలిపించాడు. 2019లో వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సౌతాఫ్రికా టీమ్ కెప్టెన్‌గా ఉన్న డుప్లెస్సి.. ఆ టోర్నీలో టీమ్ విఫ‌ల‌మ‌వ‌డంతో తొల‌గించారు. ఆ త‌ర్వాత 2020, ఫిబ్ర‌వ‌రిలో టెస్ట్‌, టీ20 టీమ్‌ల‌కు కూడా కెప్టెన్‌గా త‌ప్పుకున్నాడు.

- Advertisement -