హైదరాబాద్‌లో యాదవులు నిర్వహించే సదర్ సమ్మేళనంకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సదర్ సమ్మేళనం భారీ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, కళ్యాణ్‌కార్, ఈశ్వర్‌చౌదరి, శంకర్ రావు, గులాబ్ సింగ్, గంగపుత్ర నీలం, వేణు యాదవ్, జిట్టా ఆంజనేయులు, ఎడ్ల వరుణ్ కుమార్ యాదవ్, అభినందన్ యాదవ్, ఆశ్రిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సదర్‌కు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 27న సాయంత్రం నారాయణగూడ, ముషీరాబాద్‌లో నిర్వహించే సదర్‌కు జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, ఎలక్ట్రికల్, పోలీసులు, ట్రాఫిక్, తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లను… కల్చరల్ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.