సీనియర్ బ్యూటీ టబు ఫిజిక్ కి ఆమె ఏజ్ కి సంబంధమే ఉండదు. టబు వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలు. కానీ ఇంకా 22 ఏళ్ల అమ్మాయి ఫిజిక్ నే మెయింటైన్ చేస్తోంది. అందుకే, టబు వయసు పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతూనే ఉంది. వర్కౌట్లు, డైట్ వగైరా వగైరా వ్యవహారాలు కారణంగానే టబు 52 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఫిట్ గా ఉందని టాక్ ఉంది. అయినా ఎక్కడో అనుమానం. మరీ ముఖ్యంగా వయసు మీద పడినా టబు ఇంకా కుర్రాళ్లకు నిద్రలేకుండా ఎలా చేస్తోంది ?, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇంతకీ టబు గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసా ?, తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా టబు అందాలు చూసి అమ్మాయిలందర్లో కూడా ఈ ఉత్సుకత ఉంటుంది. పైగా టబు లాంటి అందగత్తె నుంచి నేర్చుకొవడానికి చాలా ఉంటుంది. ఇంతకీ టబు గ్లామర్ సీక్రెట్ ఏమిటో తెలుసా ?, టబు తన అందం రహస్యం గురించి మొత్తంగా చెప్పకపోయినా తన బాడీకి బాగా కలిసొచ్చిన ఓ పద్ధతిని మాత్రం బయటపెట్టింది. టబు ప్రతి రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగుతుందట. అలాగే, బాదం జూస్ తో పాటు ప్రతి రోజూ ఉదయం సాయంత్రం కొబ్బరి నీళ్ళు క్రమం తప్పకుండా తాగుతుందట. ఈ డైట్ తనకు బాగా పనిచేసిందని చెబుతోంది టబు. సరే ఎన్ని చెప్పినా.. టబు గంటల తరబడి జిమ్ చేస్తోంది. పైగా గత ముప్పై ఏళ్లుగా ఆమె పర్ఫెక్ట్ డైట్ ను ఫాలో అవుతుంది. అందుకే, ప్రస్తుత టబు అందానికి గడిచిపోయిన ముప్పై ఏళ్ల క్రమశిక్షణ కూడా ఓ కారణమే. ఏది ఏమైనా టబుకి నేటికీ ఫుల్ క్రేజ్ ఉంది.
ఇవి కూడా చదవండి…