‘సైరా’ డైలాగ్స్‌ లీక్‌..

271
- Advertisement -

ఖైదీతో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అయితే మెగాస్టార్ 151వ చిత్రంగా ‘సైరా’ (ట్యాగ్ లైన్ నరసింహారెడ్డి) మొదలైన సంగతి తెలిసిందే.

chiru 151st movie first look

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏకంగా రూ. 150 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రంలోని డైలాగులంటూ కొన్ని డైలాగులు నెట్టింట లీకయ్యాయి. ‘ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్.. అయినా నా చెయ్యి మీసం మీదకి పోయే సరికి నీ బట్టలు తడిసిపోతున్నాయిరా’ అన్న డైలాగ్ మెగా అభిమానులకు తెగ నచ్చేయడంతో శరవేగంగా షేర్ మీద షేర్ తెచ్చుకుంటూ హల్ చల్ చేస్తోంది.

ఇక డైలాగ్ లీక్ పై చిత్ర యూనిట్ ఇంతవరకూ స్పందించలేదు. ఇక ఈ డైలాగ్ అధికారికమైనా, అనధికారికమైనా, క్యాచీగా, బాగా ఉండటంతో ఫ్యాన్స్ సైతం ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -