అత్యంత సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్ ఆడిన ది గ్రేట్ స్విస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్‌ను ఆడేశారు. లండన్‌లో జరిగిన లెవర్ కప్‌లో తన చిరకాల ప్రత్యర్థి అయిన రఫెల్ నాదల్ తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడి… అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చేప్పేశారు. తన ఆట తీరుతో ప్రపంచంలో కోట్లాదిమంది ఆభిమానాన్ని సంపాదించుకున్న రోజర్… చివరి మ్యాచ్‌లో మాత్రం ఓటమితో వెనుదిరిగాడు.
టెన్నిస్ ర్యాంకింగ్‌లో 310వారాల పాటు అగ్రస్థానాన నిలిచిన రోజర్ 237వారాల పాటు ఏకచక్రాధిపత్యం వహించారు. 24ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌లో 103సింగిల్స్, 20గ్రాండ్‌స్లామ్, 8 వింబుల్డన్ టైటిల్స్ సాధించిన ఘనత ఏకైక ఆటగాడిగా చరిత్రలో నిలిచారు. శుక్రవారం జరిగిన లేవర్ కప్ డబుల్స్ మ్యాచ్‌లో టీమ్ యూరోప్ తరపున ఫెదరర్ నాదల్… అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సిస్ తియాఫో జాక్ సాక్ తో తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో ఫెదరర్ నాదల్ జోడీ ఓటమిపాలైంది.
ఈ సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ… తన చివరి మ్యాచ్‌రోజున కన్నీళ్లతో ఆటకు వీడ్కోలు పలకకూడదని నిర్ణయించుకున్నానని మ్యాచ్‌కు ముందు చేప్పిన…అది సాధ్యం కాలేదు. తన భార్యకు థ్యాంక్స్ చెప్పాడు. ఆమె అనుకుంటే నన్ను ఆడకుండా ఎప్పుడో ఆపేది. కానీ అలా చేయలేదు. నన్ను ఇన్నాళ్లు ఆడేలా ప్రోత్సహించిది. అన్ని వేళలా అండగా నిలిచింది అని అన్నాడు.
తన టెన్నిస్ జర్నీ అద్భుతంగా సాగిందని..తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియంలో కనీటి పర్యంతం చేందిన రోజర్ అతన్నితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏడ్చారు. తన కెరీర్‌కు ఎల్లప్పుడూ అండగా నిలిచిన తన భార్య మిర్కాను హత్తుకుని భావోద్వేగానకి గురయ్యాడు. ఈయనతో పాటు తోటి సహచరుడైన రఫెల్ కూడా కన్నీటి పర్యంతం చేందారు. ఇందుకు సంబంధించిన వీడియోను లేవర్ కప్ ట్విటర్ ఖాతాలో పంచుకుని స్విస్ దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికింది.