లక్షణాలు
జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడం, తలనొప్పి, గొంతునొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ముక్కు దిబ్బడ, జలుబు, వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దగ్గు, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండడం, వీటితో పాటు కొంతమందిలో వాంతులు విరోచనలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉండి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన న్యుమోనియా కు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
జాగ్రత్తలు
స్వైన్ ఫ్లూ అంటువ్యాధి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వ్యక్తికి వీలైనంతా దూరం పాటించాలి. పై లక్షణాలు ఏమాత్రం కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా చిన్న పిలల్లకు, గర్భిణీలకు ఈ వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ కాబట్టి వారు మరింత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఇంకా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. స్వైన్ ఫ్లూ వ్యాధికి నయం అయినప్పటికి మరికొన్ని రోజులు వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం మంచిది.