ఉచ్చులో పడ్డ చంద్రబాబు !

16
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని చిక్కుల్లో పడ్డారు, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్న ఆయనను అనుకోని పరిణామాలు వెంటాడుతున్నాయి. ఆయన సి‌ఎం గా కొనసాగిన టైమ్ లో అమరావతి రాజధాని నిర్మాణం ఇన్ఫ్రా స్ట్రక్చర్ సబ్ కాంట్రాక్ట్ ల నుంచి చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు అందాయని ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిని అవినీతిగా ఎందుకు పరిగణించకూడదని చంద్రబాబును నోటీస్ లో ప్రశ్నించింది. దీంతో ఎన్నికల వేళ ఎదురైన ఈ హటాత్పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చంద్రబాబు మల్లగులాలు పడుతున్నారు..

అయితే తనకు అందిన నోటీసులు చట్టబద్దంగా లేవని పలు మార్లు లేఖ రాసినప్పటికి ఐటీ శాఖ వాటిని తోసిపుచ్చడంతో పాటు వివరణ ఇవ్వాల్సిందేనని మరోసారి నోటీసులు జారీచేయడంలో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ షోకాజ్ నోటీసులు చంద్రబాబు పై కక్షపూరితంగా వచ్చాయని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా.. సమాధానం చెప్పాల్సిందేనని, చంద్రబాబు దీనిపై మీడియా ముందు మాట్లాడాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం టీడీపీని విమర్శించడానికి వైసీపీ నేతలకు ప్రధాన అస్త్రంగా మారింది. అయితే దీనిపై చంద్రబాబు నోరు మేడపకపోతే ఎన్నికల సమయానికి ఈ అంశం ఆయనకు మరింత తలనొప్పులు తెచ్చి పెట్టె అవకాశం లేకపోలేదు. మొత్తానికి వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా దూకుడుగా సాగుతున్న చంద్రబాబుకు ఊహించని ఈ పరిణామం సంధిగ్డంలో పడేసింది. మరి ఈ సమస్య నుంచి బాబు ఎలా బయటపడతారో చూడాలి.

Also Read:పోయాక కూడా ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు

- Advertisement -