పోయాక కూడా ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు

12
- Advertisement -

తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దశ దిశల వ్యాపింపచేసిన వ్యక్తి ‘నందమూరి తారక రామారావు’. గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఏకైక వ్యక్తి. తరాలు మారినా, కాలాలు దొర్లినా తెలుగు వారి గుండెల్లో అప్పటకి, ఎప్పటికి ఆయన స్థానం సుస్థిరం అని చెప్పడానికి ఇంతకూ మించిన రుజువు ఏముంటుంది ?, ఆ నట సార్వభౌముడి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పుడు ఈ కాయిన్స్ ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ మళ్లీ ముద్రించాల్సి వస్తోంది. మొదటి విడత 12,000, రెండో విడత 40,000, మూడో విడత 50,000.

నిజంగా ఈ అంకెలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కారణం.. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ వ్యక్తి పేరు మీద ఉన్న కాయిన్స్ కూడా 10,000 వేలుకు మించి ముద్రించాల్సిన అవసరం రాలేదు. కానీ, ఒక్క అన్నగారి కాయిన్స్ ను మళ్లీ మళ్లీ ముద్రిస్తున్నారు. ఇప్పటివరకూ 50 కోట్లు వరకూ ఈ కాయిన్స్ మీద ఆదాయం వచ్చింది. చివరకు ఎక్కడకు చేరి ఆగుతుందో ఈ లెక్క. 50 నుంచి 1000 కోట్లుకు పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అసలు సీనియర్ ఎన్టీఆర్ పుట్టింది 100 సంవత్సరాల క్రితం. పైగా చనిపోయి 25 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఆయన ప్రజల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. అది కదా ఎన్టీవోడి లెక్కా, ఇక మీదటయినా ఎవర్ని ఆయనతో పోల్చకండి అంటూ ఆయన అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. ఏది ఏమైనా సీనియర్ ఎన్టీఆర్ చనిపోయాక కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

Also Read:KTR:ఇది తెలంగాణ జలశక్తి

- Advertisement -