సువ‌ర్ణ‌సుంద‌రి..సెన్సార్ పూర్తి

212
suvarnasundari
- Advertisement -

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చెసుకుని మే 31న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా….నిర్మాత ల‌క్ష్మీ మాట్లాడుతూ… సువర్ణ సుందరి చిత్ర సెన్సార్ కంప్లీట్ అయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది.ఈ నెల 31వ తేదీన తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బ‌డ్జెట్ ను మించి క్వాలిటి ఔట్ పుట్ రావటం సినిమా సక్సెస్ పై కాన్పిడెన్స్ ను పెంచిందన్నారు.

దర్శకుడు ఎం.ఎస్.ఎన్‌. సూర్య మాట్లాడుతూ… సువర్ణ సుందరి లాంటి కంటెంట్ ఉన్న సినిమాకు నేను డైరెక్ట‌ర్‌గా వర్క్ చెయటం గర్వంగా ఉంది. స్టోరీ డిమాండ్ కు తగ్గట్టుగా క్వాలిటీ తో సినిమాను చేశాం. సెన్సార్ సభ్యులు మా సువర్ణ సుందరి ని చూసి టీమ్ ను అభినందించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇందులో ప్రతి పాత్ర కీలకమైనదే అన్నారు.

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ఃఎం.ఎల్‌.ల‌క్ష్మి, మ్యూజిక్‌డైరెక్ట‌ర్ఃసాయికార్తిక్‌, స్టంట్స్ఃరామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ఃనాగు, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిట‌ర్ఃప్ర‌వీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్ఃఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.

- Advertisement -