పెళ్లిపై కామెంట్‌ చేసిన సుస్మితా సేన్‌.. నెటిజన్ల ఆగ్రహం

279
Sushmita Sen
- Advertisement -

బాలీవుడ్ సీనియర్ అందాల తార, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పెళ్లి పీటలెక్కనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు అఫీషియల్ ప్రకటనలేవీ వెలువడనప్పటికీ.. అతి త్వరలో సుస్మితా పెళ్లి చేసుకోబోతోందంటూ చర్చలు ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా రోహ్‌మన్ అనే మోడల్‌తో డేటింగ్ చేస్తున్న సుస్మిత.. అతన్ని ప్రేమిస్తున్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పేసింది. ఇటీవల జరిగిన పలు వేడుకల్లో ఈ జంట చురుకుగా పాల్గొనటంతో.. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనల్లో కూడా ఉన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.

Sushmita Sen

ఈ నేపథ్యంలో పెళ్లి గురించి సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఈ పెళ్లిళ్లను ఎవడు కనిపెట్టాడో..! నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానంటే.. నువ్వు ఎప్పుడూ నన్ను వదిలి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూస్తాను’ అంటూ రోమన్‌పై తనకున్న ప్రేమను పరోక్షంగా వ్యక్తం చేశారు. ఈ విధంగా సుస్మితా సేన్‌ పెళ్లిపై కామెంట్‌తో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌ కాస్తా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. పెళ్లి గురించి సుస్మిత జనాల్లో తప్పుడు అభిప్రాయాలను పుట్టిస్తున్నారంటూ తిట్టిపోస్తున్నారు.

అయితే ‘పెళ్లి చేసుకోవాలా? వద్దా? అన్నది నీ ఇష్టం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటిపై సుస్మిత స్పందిస్తూ మరో ఫన్నీ పోస్ట్‌ పెట్టారు. ‘మా టీచర్‌ స్కేల్‌ను నావైపు చూపిస్తూ.. ‘ఈ స్కేల్‌ చివర్లో ఓ ఇడియట్‌ ఉన్నాడు’ అంది. అప్పుడు నేను.. ‘ఏ చివర్లో టీచర్?’ అని అడిగినందుకు నన్ను బయటికి పంపించేసింది’ అంటూ నెటిజన్లకు తన స్టైల్‌లో సమాదానం ఇచ్చింది.

- Advertisement -