రాజ్ పుత్ కు బాలీవుడ్ లో అవకాశాలు మరింత పెరిగాయి.తాజాగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, కృతిసనన్ తో కలసి ‘రాబ్తా’ మూవీ లో నటించాడు. రెండు యుగాల మధ్య నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో ఎం ఎస్ ధోనీ మూవీతో తెగపాపులార్టీ తెచ్చుకున్నాడు రాజ్ పుత్. అయితే ఈ హీరో గతంలో సీరియల్స్‌లో కూడా నటించేవాడు. అప్పట్లో ఇతనికి అంకితా లోఖండే అనే గాళ్ ఫ్రెండ్ ఉండేదట. టీవీ నటులుగా అరంగేట్రం చేసిన సుశాంత్, అంకిత సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ధోనీ మూవీ తర్వాత సుశాంత్ కి క్రేజ్ రావడంతో ఆ అమ్మడు అతనికి గుడ్ బై చెప్పేసిందట. మరి ఇప్పుడు అంకితకు కూడా గుడ్ టైమ్ ప్రారంభమైపోయింది.
అంకిత ఓ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ సంపాదించేసింది. మణికర్ణిక అనే టైటిల్ పై కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో.. ఝాన్సీ లక్ష్మీ బాయ్ కథను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రకు అంకితా లోఖండేను తీసుకున్నారు. అయితే.. ఈమెను మాత్రం ఇంకా మీడియా జనాలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ గాళ్ ఫ్రెండ్ గానే చూస్తున్నారు. తనకంటూ గుర్తింపు ఉండగా.. దాన్ని వదిలేసి సుశాంత్ మాజీ లవర్ గా చూస్తుండడాన్ని అంకిత అస్సలు సహించలేకపోతోంది.
అయితే తాను చేస్తున్న సీరియల్స్ బాలీవుడ్ మూవీస్ ని పట్టించుకోకుండా కేవలం ఓ హీరోకు మాజీ లవర్ గా చెప్పడాన్ని అంకిత ఖండిస్తోంది. ఇకపై మీడియా జనాలు తన దగ్గర ఆ మాట తీసుకురాకూడదని స్ట్రాంగ్ గా చెబుతూనే.. నన్ను అతని మాజీ ప్రియురాలిగా చూడొద్దు అంటోంది ఈ బాలీవుడ్ భామ.