తమిళ స్టార్ సూర్య దర్శకుడు బాలా కలయికలో రాబోతున్న మూడో సినిమా అచలుడు అర్ధాంతరంగా ఆగిపోయింది. 19యేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి అచలుడు సినిమాను నిర్మించనున్నారు. 40శాతం సినిమాను పూర్తి చేసుకున్న అచలుడు దర్శకుడు వెనుకడుగు వేశాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ వార్తాలపై గతంలోనే స్పందించిన బాలా…పుకార్లను నమ్మవద్దని కొట్టివేశాడు. కృతిశెట్టి ఫీమేల్ లీడ్‌రోల్‌లో నటిస్తుండగా జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చుతున్నారు. సూర్య సొంత బ్యానరైన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో స్వయంగా నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా దర్శకుడు బాలా అచలుడు (వనంగాన్) సినిమాలో నేను మా తమ్ముడు సూర్యతో కలిసి ‘వనంగాన్’ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకుంటున్నాను. అయితే కథలో కొన్ని మార్పుల వల్ల ఈ కథ సూర్యకి సరిపోతుందా అనే సందేహం ఇప్పుడు వచ్చింది. సూర్యకి నాపై, ఈ కథపై పూర్తి నమ్మకం ఉంది. అంత ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్న తమ్ముడికి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకూడదనేది ఒక అన్నగా నా కర్తవ్యం. దాంతో సూర్య ‘వనంగాన్’ సినిమా నుంచి తప్పుకోవాలని ఇద్దరం చర్చించుకుని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. ఇది అతనికి చాలా బాధ కలిగించినప్పటికీ, అతను తన ఉత్తమ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని బాలా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బాలా స్పందనతో సూర్య సంస్థైన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా స్పందించింది. బాలా అన్న భావాలను, నిర్ణయాలను గౌరవిస్తున్నామని మరియు ఈ సినిమా నుంచి వైదొలగుతున్నామని ప్రకటించింది. ఇంకా మేం ఎప్పుడూ బాలా అన్నకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గతంలో దర్శకుడు బాలా విక్రమ్ కొడుకు అయిన ధృవ్ విక్రమ్‌తో ఇలాగే స్పందించాడు. వర్మ అనే పేరుతో పరిచయం చేస్తూ మధ్యలో ఆపేశారు. ఇది అర్జున్‌రెడ్డి సినిమాకు రీమేక్ కావడం విశేషం. ధృవ్ విక్రమ్ మరో దర్శకుడితో ఆదిత్య వర్మ అనే పేరుతో సినిమా తీశాడు. ప్రస్తుతం సూర్య దర్శకుడు శివతో కలిసి #suriya42 పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతుందని కోలీవుడ్ సమాచారం.
ఇవి కూడా చదవండి…
నగ్నంగా చిరంజీవి హీరోయిన్ !
‘హిట్2’ కి అసలు పరీక్ష
విడుదలకు ముందే రికార్డు… హనుమాన్