భయపెట్టేందుకు రెడీ అవుతున్న నయనతార

90
- Advertisement -

తాజాగా మెగా స్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ లో నటించిన నయనతార ఓ హారర్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నయనతార భర్త విజ్ఞేశ్ శివన్ నిర్మాణంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ రూపొందించిన హారర్ థ్రిల్లర్ సినిమా కనెక్ట్ డిసెంబర్ 22న రిలీజ్ అవ్వబోతుంది. తమిళ్ , తెలుగులో ఒకే రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

తెలుగులో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ లో ధమాకా మినహా మరే పెద్ద సినిమా లేకపోవడంతో తమిళ్ లో రిలీజ్ అవుతున్న 22నే తెలుగు రిలీజ్ డేట్ లాక్ చేశారు. థ్రిల్లర్ జోనర్ లో అశ్విన్ కి మంచి అనుభవం ఉంది. అతడు తీసిన మాయ , గేమ్ ఓవర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.

ఇక నయనతార , అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. మరి తాజాగా వచ్చిన హారర్ తెలుగు సినిమా మసూద మంచి హిట్ అనిపించుకుంది. ఇప్పుడు నయనతార ఈ జోనర్ సినిమాతో తెలుగులో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

‘హిట్2’ కి అసలు పరీక్ష

విడుదలకు ముందే రికార్డు… హనుమాన్‌

ధమాకాలో వింటేజ్ రవిని చూస్తారు:భీమ్స్

- Advertisement -