సురేష్ ప్రొడక్షన్స్‌కు ‘మానాడు’ రీమేక్ హక్కులు..

25

టాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. కొన్ని సినిమాలు చివరి దశలో ఉండగా ఇంకొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్‌ లైన్ అప్‌లో ఉన్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ సినిమాకు ఏసియన్ సినిమాస్ కూడా భాగస్వామ్యం వహించనుంది.

శింబు, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఈ స్పై థ్రిల్లర్‌ను వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. సురేష్ కామాక్షి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 25న విడుదలైంది. 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. మానాడును మిగతా భాషల్లో సురేష్ ప్రొడక్షన్ రీమేక్ చేయనుంది. దానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.