సుప్తబద్ద కోణాసనంతో తలనొప్పికి చెక్!

14
- Advertisement -

నేటి రోజుల్లో అధిక పని ఒత్తిడి కారణంగా చాలమందికి తలనొప్పి సమస్య వేధిస్తూ ఉంటుంది. తలనొప్పి సమస్య రావడానికి కేవలం శారీరక మానసిక ఒత్తిడి మాత్రమే కాకుండా నిద్రలేమి, జలుబు వంటి వాటివల్ల కూడా తలనొప్పి ఏర్పడుతుంది. అయితే ఈ తలనొప్పి నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది మెడిసన్ కంటే కూడా టీ కాఫీ వంటివి తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. టీ లేదా కాఫీ వంటి వాటిలో ఉండే కెఫీన్ పదార్థానికి తలనొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. అయితే టీ లేదా కాఫీ ప్రభావం ఉన్నంత వరకు తలనొప్పి తగ్గుతుంది కానీ ఆ తరువాత ఈ తలనొప్పి సమస్య మళ్ళీ అధికం అవుతుంది. అయితే తలనొప్పి సమస్య నుంచి పూర్తిగా బయటపడేందుకు యోగా లోని సుప్తబద్ద కోణాసనం చక్కగా ఉపయోగ పడుతుంది. ఈ ఆసనం ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా వేయవచ్చు. అదెలాగో చూద్దాం !

ముందుగా నేలపై దుప్పటి లేదా యోగా షీట్ వేసుకొని వెల్లకిలా పడుకొని కళ్ళు బర్లా చాపలి. ఆ తరువాత రెండు కాళ్ళ యొక్క ఆరిపాదాలు ఒకదానికొకటి అభిముఖం చేసి వీలైనంతగా రెండు తొడల మద్యకు తీసుకురావాలి. ఈ సమయంలో తల, నడుము మరియు మోకాళ్ళు కొంచెం ఎత్తులో ఉండే విధంగా దిండు గాని ఇంకేవైన వాటిని పోటోలో చూపిన విధంగా ఉంచుకోవాలి. ఇలా అరికాళ్లు అభిముఖంగా చేసి రెండు తొడల మద్యకు తీసుకొచ్చిన తరువాత చేతులను దూరంగా ఛాతి ఫ్రీగా ఉంచాలి. ఆ తరువాత సాధారణ స్థితిలో శ్వాస తీసుకుంటూ 5-10 నిముషాల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇలా ప్రతిరోజూ సుప్త బద్దకోణాసనం వేయడం ద్వారా శారీరక ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గి రెగ్యులర్ గా వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read:టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ -2024

- Advertisement -