‘సుప్త మత్స్యెంద్రాసనం’తో ఆ సమస్య దూరం!

55
- Advertisement -

మారుతున్న జీవన విధానం కారణంగా ప్రతిరోజూ యోగా లేదా వ్యాయామం చేయడం తప్పనిసరి అయింది. అయితే కసరత్తు చేయాయడానికి చాలమంది టైమ్ కేటాయించలేరు. అలాంటి వారికి యోగా ఒక చక్కటి పరిష్కారం. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనలు అన్నీ ఇన్ని కావు. యోగాలో ఎన్నో ఆసనాలు కలవు. ఒక్కొక్క ఆసనానికి ఒక్కక్క నిర్ధిష్ట ఉపయోగం ఉంటుంది. అందువల్ల యోగా చేయడం పట్ల అశ్రద్ద వద్దని యోగా నిపుణులు చెబుతున్నారు. నేటి రోజుల్లో కూర్చొని పని చేసే వారే చాలా ఎక్కువ..గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డిస్క్ సమస్యలు పెరిగి వెన్ను నొప్పి, నడుం నొప్పి కి దారితీస్తుంది. అయితే ఇలా డిస్క్ సమస్యలతో భాడపడే వారికీ ” సుప్త మత్స్యెంద్రాసనం ” చక్కటి పరిష్కారంగా ఉంటుంది. అందువల్ల ఈ ఆసనం ఎలా వేయాలి. ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం !

ఆసనం వేయు విధానం
యోగా షీట్ లేదా నేలపై వెల్లకిల పడుకోవాలి. ఆ తరువాత రెండు చేతులను నేలపై సమాంతరంగా ఉంచి కుడికాలు మడిచి, ఎడమ చేతి కాలు మీదుగా శరీరం పక్కకు వంచి, ఫోటోలో చూపిన విధంగా నేలకు తాకించాలి. నేలకు తాకిన కుడికాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు శరీరం మొత్తాన్ని కదల్చకుండా నడుం భాగం మాత్రమే కదిలించాలి. ఛాతీ, వీపు, పొట్టబాగం, తల ముందుకు చూస్తూ ఉండాలి. ఇక ఈ భంగిమలో ఉన్నప్పుడూ శ్వాసక్రియ సాధారణంగా జరిగించాలి. ఇలా 10 నుంచి 15 నిముషాల పాటు ఉండి ఆ తరువాత సాధారణ స్థితికి రావాలి.

Also Read: ‘గామి’ సెన్సేషన్.. 50 మిలియన్ స్ట్రీమింగ్

ఉపయోగాలు
ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల కాళ్ళు చేతులు లాగడం, వెన్నునొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. అంతే కాకుండా ఛాతీ, నడుం నొప్పిని తగ్గించి వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఇంకా మలబద్దకాన్ని దూరం చేసి జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో కూడా ఈ ఆసనం ఉపయోగ పడుతుంది.

Also Read:Horse gram:వామ్మో.. ఉలవలతో ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -