మెగా హీరో, సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు ఈసినిమాను నిర్మించగా తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, రితిక సింగ్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా ఈచిత్ర రిలీజ్ డేట్ ఖరారు చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 12న చిత్రలహరి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటైర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఈమూవీలో సాయి ధరమ్ తేజ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు తేజ్. ఆయన నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయిన విషయం తెలిసిందే.