సుప్రిమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి హిట్ కొట్టాడు. అంతేకాకుండా బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించింది. చిత్రలహరి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తేజ్..తాజాగా అనాథ పిల్లలతో కలిసి అవెంజర్స్ మూవీని వీక్షించారు. అనాథ పిల్లల కోసం ప్రత్యేక షో వేయించి తన మంచి మనసును చాటుకున్నారు.
అవేంజర్స్ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అక్షర్ కుటీర్ ఆశ్రమం, గుడ్ షెపర్డ్ ఆశ్రమం, సుధీర్ ఫౌండేషన్, స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీ, నవజీవన్ ఫౌండేషన్‌కు చెందిన పిల్లలు ఈ స్పెషల్ షో చూసి ఎంజాయ్ చేశారు. అనంతరం పిల్లలతో కలిసి కాసేపు ముచ్చటించారు తేజ్.
ఈసందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ… ‘అవెంజర్స్ సినిమా పెద్దలతో పాటు పిల్లలు అమితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ పిల్లలతో కలిసి ఈ సినిమా చూసే అవకాశం రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. నా సినిమాలు అర్ధం చేసుకునేంత వయసు కాదు వీళ్లది…అందుకే అవేంజర్స్ సినిమా చూపించానని తెలిపారు. సాయి తేజ్ తన తర్వాత సినిమా మారుతి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న మారుతి …త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.