ఆధార్‌ విశిష్టమైంది.. సుప్రీం కీలక తీర్పు

182
- Advertisement -

బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని నేడు సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే మొబైల్‌ కనెక్షన్లకు కూడా అవసరం లేదని చెప్పింది. పాఠశాల అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది. కాగా ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి, పాన్‌ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు తప్పకుండా ఉండాలని కోర్టు వెల్లడించింది.

Aadhaar

ప్రస్తతం బ్యాంకు ఖాతా మొదలు పాన్‌కార్డ్‌, ఫోన్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్సు… ఇలా ప్రజలు ఏ సేవను పొందాలన్నా 12 అంకెల ఆధార్‌ సంఖ్యను ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో మిగతా గుర్తింపు ధ్రువపత్రాలన్నింటినీ పక్కన పెట్టినట్టయింది. ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించి, డిజిటలీకరించడం వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనీ… ఈ సమాచారనిధికి భద్రత లేదనీ.. ఈ వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతికి చిక్కితే దుర్వినియోగమయ్యే ముప్పుందని తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. వ్యక్తుల వేలి ముద్రలు, కనుపాపలు తదితర బయోమెట్రిక్‌ సమాచారంతో కూడిన ఆధార్‌ను తప్పనిసరి చేయరాదంటూ పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి మొత్తం 27 పిటిషన్లు దాఖలయ్యాయి.

ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణ చేసింది. దాదాపు 38 రోజుల పాటు సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ కేసుకు సంబంధించి 30 పిటిషన్లు దాఖలయ్యాయి. మేలో వాదనలు పూర్తికాగా తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. బుధవారం దీనిపై తీర్పును వెలువరించింది.

- Advertisement -