- Advertisement -
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిపై స్టేటస్ రిపోర్టును సుప్రింకోర్టుకు సమ్పర్పించిన కేంద్ర ప్రభుత్వం.కరోనా నివారణకు ప్రభుత్వం జనవరి 17 నుంచే చర్యలు తీసుకుందని న్యాయస్థానానికి తెలిపారు సొలిసిటర్ జనరల్. కరోనా చికిత్సకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలని సుప్రీం కేంద్రానికి సూచించింది.
వలసలను ఆపేయాలని, వలస కూలీలకు వసతిగృహాలు, భోజన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు వార్తల నివారణకు ప్యానెల్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రజలకు వాస్తవ సమాచారం కోసం 24 గంటల్లో పోర్టల్, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాల జారీ చేసింది.
- Advertisement -