బాబా రాందేవ్‌కు సుప్రీం సమన్లు

22
- Advertisement -

బాబా రాందేవ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటింకే పతంజలి యాడ్స్‌ను నిలిపివేయాలని ఆదేశించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. తాజాగా పతంజలి యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని సమన్లు జారీచేసింది.

బాబా రాందేవ్ కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డ్డారని జ‌స్టిస్ హిమా కోమ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధ‌ర్మాస‌నం పేర్కొంది. డ్ర‌గ్స్ అండ్ రెమిడీస్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 3, 4 ప్ర‌కారం రాందేవ్‌, బాల‌కృష్ణ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు కోర్టు తెలిపింది. రాందేవ్ బాబాతో పాటు ఎండీ ఆచార్య బాలకృష్ణకు సమన్లు జారీ చేసింది.

పతంజలి ఉత్ప‌త్తుల‌కు సంబంధించి చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను నిలిపివేయాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు ప‌తంజ‌లి ఆయుర్వేద‌కు ఆదేశాలు జారీ చేసింది. కానీ పతంజ‌లి ఆయుర్వేద ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డింది. దీనికితోడు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌తంజ‌లి సంస్థ సుప్రీం నోటీసుల‌కు రెస్పాన్స్ ఇవ్వ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ప్ర‌తిస్పందించ‌లేద‌ని, వ‌చ్చే విచార‌ణ స‌మ‌యంలో ఎండీ హాజ‌రుకావాల‌ని కోర్టు పేర్కొన్న‌ది.

Also Read:KCR:దళిత,బహెజనులు ఏకంకావాలి

- Advertisement -