నీట్,జేఈఈ పరీక్షలు వాయిదా వేయలేం: సుప్రీం

126
Supreme Court

నీట్‌, జేఈఈ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌న్న రివ్యూ పిటిష‌న్‌ను దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్షలు వాయిదా వేయాల‌ని సుప్రీంకోర్టులో పలు రాష్ట్రాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది.

సెప్టెంబర్ 1 నుండి నీట్,జేఈఈ పరీక్షలు ప్రారంభం కాగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు సంయుక్తంగా ఆగ‌స్టు 28న‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఒక‌వైపు కరోనా మహమ్మారి, మరోవైపు భారీ వర్షాలు, వరదల వల్ల తమ తమ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయిని పేర్కొన్నారు. కానీ ఇవేమి పట్టించుకోని సుప్రీం…పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపింది.