- Advertisement -
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కోర్టు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వంద శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలి అన్న డిమాండ్‌కు సుప్రీంలో మరోసారి చుక్కెదురైంది. వీవీప్యాట్ లెక్కింపుపై గతంలో తామిచ్చిన ఆదేశాలే అమలవుతాయని, 100 శాతం స్లిప్ లను లెక్కించాలన్న పిటిషన్ ను తిరస్కరిస్తున్నామని వెల్లడించింది.
‘టెక్నోపర్ ఆప్’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం, ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని అభిప్రాయపడింది. వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
- Advertisement -