పెళ్లైన 18 నెలలకే విడాకులు కోరుతూ, తన భర్త నుండి భారీ మొత్తంలో భరణం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఓ మహిళ. భర్త నుండి విడాకుల భరణం కింద బీఎండబ్ల్యూ కారు, ముంబైలో ఇల్లు, 12 కోట్ల నగదు ఇప్పించాలని తన పిటిషన్‌లో పేర్కొంది.
ఈ పిటిషన్ విచారణ చేస్తూ, “పెళ్లైన 18 నెలలకు దాదాపు నెలకు ఒక కోటి రూపాయల చొప్పున భరణం అడుగుతున్నారు అని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్.
మీరు ఎంబీఏ చదివారు, ఐటీ ప్రొఫెషనల్, సంపాదించే సామర్థ్యం ఉంది, చక్కని ఉద్యోగం చేసుకోండి అంటూ మహిళకు సూచించింది బీఆర్ గవాయ్ ధర్మాసనం. అయితే తన భర్త ధనవంతుడని, తాను మానసిక ఇబ్బందులతో బాధపతున్నానని అతనే విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని, తాను మానసిక ఇబ్బందులు ఉన్నట్టు కనిపిస్తున్నానా అధ్యక్ష్యా అంటూ బీఆర్ గవాయ్‌ని ప్రశ్నించింది మహిళ.
దీంతో ముంబైలో ఒక ఇల్లు లేదంటే రూ.4 కోట్లు భరణం తీసుకోవాలని ఆమెకు సూచించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్.
Also Read:గ్రీన్ ఛాలెంజ్..8వ ఎడిషన్

