గ్రీన్ ఛాలెంజ్..8వ ఎడిషన్

9
- Advertisement -

మరో నాలుగు రోజుల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ 8 వ ఎడిషన్ ప్రారంభంకానుందని ఎక్స్ వేదికగా తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం వారసత్వాన్ని స్మరించుకుంటూ గ్రీన్ఇండియాఛాలెంజ్ 8వ ఎడిషన్ జూలై 27న ప్రారంభం కానుంది అని తెలిపారు.

గౌరవనీయులైన కెసిఆర్ దార్శనిక నాయకత్వంలో, హరిత తెలంగాణ కల వేళ్ళూనుకుని, లక్షలాది మంది మొక్కలు నాటడానికి, రక్షించడానికి మరియు సంరక్షించడానికి స్ఫూర్తినిస్తూ వికసించింది అని వెల్లడించారు.

ఆ దార్శనికతను ముందుకు తీసుకెళ్దాం. పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన మరియు మెరుగైన రేపటిని సృష్టించడానికి చేతులు కలపండి.మార్పును నాటుకుందాం.మార్పుగా అవుదాం అంటూ పిలుపునిచ్చారు సంతోష్ కుమార్.

 

Also Read:జోషి దర్శకత్వంలో ఉన్ని ముకుందన్!

- Advertisement -