మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే నేడు సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలను అడిగి తెలుసుకుంది. మెజారిటీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని పేర్కొంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది.
ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఫడ్నవీస్, అజిత్ పవార్‌లకు నోటీసులు జారీ చేసింది. త్రిపక్ష కూటమి కోరుతున్నట్లుగా బలపరీక్ష వెంటనే నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గవర్నర్‌కు ఇచ్చిన మద్దతు లేఖ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రేపు ఉదయం 10.30 గంటలలోపు మద్దతు లేఖ ఇవ్వాలని సూచించింది. మద్దతు లేఖ సమర్పించిన తర్వాత బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ధర్మాసనం.
Supreme Court Notices to Centre-Fadnavis & Ajit